తాడో పేడో తేల్చుకోనున్న చంద్రబాబు

అభివృద్ధి విషయంలో ఇక వెనక్కు తగ్గేదిలేదనే పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందుకే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీకి లేఖ రాశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని అందులో ప్రస్తావించారు. ఏపీకి చేసే ఆర్థిక సాయాన్ని విదేశీ ఆర్థిక సంస్థలనుంచి కాకుండా నాబార్డు నుంచి గ్రాంట్‌ రూపంలో ఇవ్వాలని కోరారు బాబు.  ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన ప్రకారం కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 2015 నుంచి 2020 వరకూ ఏపీకి రూ. 16,447 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఇచ్చే సాయాన్ని 90:10 నిష్పత్తిలో ఇవ్వాలని కోరారు చంద్రబాబు. ఆ మొత్తాన్ని విదేశీ ఆర్థిక సంస్థ నుంచి చేపట్టే ప్రాజెక్టులకు 2015-2020 మధ్యకాలంలో అందివ్వాలన్నారు. అంతే కాదు..కేంద్రం గతంలో చెప్పిన అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు చంద్రబాబు. 

ప్రధాని మోడీతో భేటీకి ముందు చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. ప్రత్యేక హోదా సంగతిని అడకకుండా ప్యాకేజి నిధులను వెంటనే ఇవ్వాలని కోరడం చర్చనీయాంశమైంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*