వివాదంలో అజ్ఞాతవాసి సినిమా పాట

అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కల్యాణ్ పాడిన కొడకా..కోటేశ్వరరావు పాట వివాదస్పదమైంది. ఒకవైపు ప్యాన్స్ పండుగ చేసుకుంటుంటే మరోవైపు ఆ సినిమాలోని పాటను తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంది. సినిమాకు అప్పుడే హిట్ టాక్ రాగా…మరోవైపు అంతే స్థాయిలో వివాదాలు ముసురుకున్నాయి. సినిమా కాపీరైట్స్ విష‌యం కీలక మలుపులు తిరిగి రాజీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు పవన్ కల్యాణ్ తోపాటు..చాలా మంది పెద్దలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రెంచ్ సినిమా కాపీ కొట్టారంటూ ఆ సినిమా నిర్మాణ సంస్థ టీసిరీస్ తెలుగు అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ కు నోటీసులు పంపడమే ఇందుకు కారణం. ఎదో రకంగా ఆ గొడవ స‌ద్దుమ‌ణిగేలా చూసుకున్నారు నిర్మాత‌. ఇందుకు డబ్బులు భారీగానే ఇచ్చారంటున్నారు.

కానీ ఈ సినిమాలో ప‌వ‌న్  ‘కొడకా కోటేశ్వరరావు ఖర్సైపోతవురో… నువ్వు పులుసైపోతవురో…’ అంటూ పవన్ ఆడారు. పాడారు. ఆపాట వ‌ల్ల త‌మ మ‌నోభావాలు తింటున్నాయ‌ని  కోటేశ్వరరావు అనే న్యాయవాది కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఫలితంగా ఈ సినిమాపై కేసు న‌మోదు అయ్యింది. మా మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా ఉండాలంటే  పాటలోని కోటేశ్వరరావు అన్న పేరును తొల‌గించాల‌ని ఆయన కోరారు. దీంతో కోర్టు ఏం తీర్పునిస్తుందోననే చర్చ సాగుతోంది. యుఎస్ లో ఒక రోజు ముందే సినిమా విడుదల కావడంతో అంతటా రేటింగ్స్ వచ్చాయి. ఉమర్ సంధూలాంటి క్రిటిక్ నాలుగు స్టార్ మార్కులు ఇవ్వడంతో సినిమా హిట్ అనే టాక్ వచ్చింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*