పోలవరం ప్రాజెక్టు పనుల కోసం పూజలు

మరోసారి పోలవరం సందర్శించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగిస్తానని ప్రధాని నరేంద్రమోడీ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. దానికంటే ముందే పోలవరంలో నిర్మించే కాపర్ డ్యామ్ లకు అనుమతినిచ్చారు. అంతేకాదు…కాంట్రాక్టర్ ను మార్చుకునే వెసులుబాటును కల్పించారు. మరోవైపు నిధులను విడుదల చేసేందుకు సిద్దమని కేంద్రం ప్రకటించింది. మొత్తంగా శుభసూచికమనే చెప్పాలి. అందుకే చంద్రబాబునాయుడు పోలవరం సందర్శించి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. 

రాష్ట్రంలో నదులు అనుసంధానం చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. గోదావరి, పెన్నా, నాగావళి, వంశధార నదులు అనుసంధానం వల్ల రాష్ట్రానికి సాగు, తాగునీటి కొరత తీరుతుందన్నారు. అదే సమయంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అంతే కాదు..పోలవరంలోని నిర్మిస్తున్న అగ్రిగేట్‌ కూలింగ్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు బాబు. ఎగువ కాపర్‌ డ్యామ్‌ జట్‌ గ్రౌటింగ్‌ పనులకు పూజలు నిర్వహించారు. స్పిల్‌వే, ఎగువ కాపర్‌ డ్యామ్‌, డయాఫ్రం వాల్‌, గేట్ల తయారీ పనులను పరిశీలించి పనుల పురుగతి పై వివరాలు తెలుసుకున్నారు. 

వైకాపా, కాంగ్రెస్ లు అడ్డుగా నిలుస్తున్నాయి…

పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు సి.ఎం చంద్రబాబు. కాంగ్రెస్‌ పార్టీ పాదయాత్ర చేయడం ప్రజలను రెచ్చగొట్టేందుకే అని అన్నారాయన. ప్రాజెక్టు వద్ద పనులు వేగం పుంజుకున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. కొత్త అగ్రిగేటర్‌ కూలింగ్‌ ప్లాంట్‌ వల్ల రోజుకు 5000 వేల క్యూబిక్‌మీటర్ల కాంక్రీట్‌ పనులు చేస్తారని చెప్పారు. . రాష్ట్రంలో 29 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి లక్ష్యం నిర్దేశించుకోగా… ఇప్పటికి 9 ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పారు. మరో 8 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని గుర్తు చేశారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం 5 ఫేజ్‌ల ద్వారా పూర్తి చేస్తామని.. దీనివల్ల  రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు చంద్రబాబు.

ప్రధాని మోడీతో భేటీకి ముందు పోలవరం పనుల పురోగతి పై చంద్రబాబు తెలుసుకోవడమే కాదు..మరిన్ని వివరాలను ఆయనకు అందించేందుకు సిద్దమవుతున్న తీరు హాట్ టాపికైంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*