పవన్ కల్యాణ్ కు ప్లెక్సీ కట్టిన ఎన్టీఆర్ ప్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా రేపు విడుదల కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు.  ఈ సినిమా విడుదలను స్వాగతిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలోని రామా టాకిస్ వద్ద ఇలా ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. అజ్ఞాతవాసి సినిమాకు ఆల్ ద బెస్ట్ చెబుతూ ఎన్టీఆర్ అభిమానులు ఫ్యాన్స్ ఫ్లెక్సీలు పెట్టడం చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల ఫొటోలతో ఆ ఫ్లెక్సీలు ఉన్నాయి. ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్ కలిసి ఇలా ఫ్లెక్సీలు పెట్టడాన్ని ఆశ్చర్యమే. ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన అలరించారు. అందుకే ఇప్పుడు ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్ ఇలా అందరికీ ఆదర్శవంతం అయ్యేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

సెన్సార్ టాక్ బాగానే ఉంది. ఈ సినిమా U/A సర్టిఫికెట్ ను పొందింది. త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకుడు కావడంతోనే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో ప‌వ‌న్ న‌ట‌న‌, డైలాగ్స్, వినోదం, యాక్షన్ సీన్స్ బాగా కుదిరాయంటున్నారు. జనసేన పార్టీ పెట్టి జనాల్లో తిరుగుతున్నాడు కాబట్టి ఈ సినిమా ద్వారా మంచి మెస్సేజ్ ఇచ్చాడని చెబుతున్నారు. మ్యూజిక్ డైర‌క్ట‌ర్ అనిరుధ్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.  ఫైట్ సీన్స్ కూడా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమంటున్నారు. మరోవైపు అజ్ఞాతవాసి చిత్రం కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాడిన కొడకా కోటేశ్వరరావు పాటకు నెట్టింట్లో  బాగానే లైక్స్ వస్తున్నాయి. అత్తారింటికి దారేది చిత్రంలో ‘కాటమరాయుడా కదిరీ న‌రసింహుడా’ అనే పాట‌ని ప‌వ‌న్ పాడి అభిమానుల‌ను అలరించారు. ఇప్పుడు  అజ్ఞాత‌వాసి చిత్రం కోసం పాడిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ పవన్ కు జోడిగా నటించారు. 

ఇద్దరు స్టార్ హీరోల ఫోటోలను ఒకే ప్లెక్సీ పై ఏర్పాటు చేసి స్వాగతించడం మంచి పరిణామనేనని చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*