రేషన్ కార్డుల కోసం కుటుంబాలు విడిపోతున్నాయా…

రేషన్ కార్డుల కోసం కుటుంబాలు విడిపోతున్నాయని సి.ఎం చంద్రబాబు చెప్పిన మాట. వాస్తవంగా అంత పరిస్థితి ఉందా అంటే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. వాస్తవ పరిస్థితిని పరిశీలిద్దాం. ఒకే కుటుంబంలో కలిసి ఉంటున్న వారు విడి విడిగా రేషన్ కార్డులు తీసుకుంటున్నారు. ఫలితంగా దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. తనకు రేషన్ కార్డుఉన్న తండ్రి..కొడుకు, కోడలు ఇంట్లోనే ఉంటే..మరో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఫలితంగా అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుంది.

మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది. తాతాలు, కొడుకులు, మనవళ్లు, మనవరాళ్లు అంతా కలిసే ఉంటున్నారు. ఉద్యోగం కోసం కొడుకు, కోడలు మరో ఊరు వెళ్లినా సొంతూరులో వారి పేరుతో రేషన్ కార్డులు ఉంటున్నాయి. అలాంటి రేషన్ కార్డులను తొలిగించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈజన్మభూమి కార్యక్రమంలోనే ఏకంగా 20 వేల రేషన్ కార్డులను తొలగించారు. కానీ వేలి ముద్రలు, ఐరిష్ పడలేదనే కారణంతో ప్రతి నెలా రేషన్ సరుకు తీసుకోని వారి సంఖ్య ఇప్పుడు లక్షల్లో ఉంటోంది. 

రేషన్ కార్డులు ఎన్ని…

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 50.07 లక్షల రేషన్ కార్డుదారులను ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో 2017 మే నెలలో 18 లక్షల కార్డుదారులు వేలి ముద్రలు సరిగా పడలేదనే కారణంతో బియ్యం తీసుకోలేదు. జూన్‌లో 18.72లక్షలు, జులైలో 18.36 లక్షల కార్డు దారులు బియ్యం తీసుకోలేదు. ఆగస్టులో ఈ సంఖ్య 19,17,633కు పెరిగింది. సెప్టెంబర్, ఆక్టోబర్, నవంబర్, డిసెంబర్ నాటికి ఆ సంఖ్య 20 లక్షలు దాటింది. ఫలితంగా రేషన్ మిగులుతోంది. మోసాలను అరికట్టామని అధికారులు చెబుతున్నా అసలు సంగతి ఇది. కానీ ఇప్పుడు ఏకంగా మరో 20 లక్షల దరఖాస్తులు కొత్తగా ప్రభుత్వానికి వచ్చాయి. అది చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు.

ఇదే సమయంలో జన్మభూమి సభలో సిఎం చంద్రబాబునాయుడు వాస్తవాలను చెప్పారు. రేషన్ కార్డులు, ఫించన్ల కోసం కుటుంబాలు విచ్చిన్నం కాకుండా చూడవలసిన బాద్యత అందరిపైన ఉందన్నారు. ప్రభుత్వ పధకాల లబ్ది కోసం, కార్డులు,పెన్షన్ ల కోసం విడిపోవద్దని సూచించారు. .

పండగ కానుకలు కుటుంబాలపరంగా కాకుండా సభ్యుల సంఖ్య ఆధారంగా ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పారు చంద్రబాబు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం కుటుంబాల నుంచి వేరుపడటం మంచిది కాదన్నారు. తల్లిదండ్రుల్ని బాగా చూసుకునే వారికి సింగపూర్‌లో ఇళ్లు, ప్రభుత్వ లబ్ధి అందుతుందని ప్రస్తావించారు చంద్రబాబు. ప్రభుత్వ పథకాలకోసం విడిపోతున్నట్లు ఉండటం మంచిది కాదు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*