కత్తి మహేష్ ప్రశ్నలకు రాని సమాధానం

కత్తి మహేశ్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య జరుగుతున్న మాటల యుద్దం రోజు రోజుకు పెరుగుతోంది. అదే సమయంలో కత్తి మహేష్ హీరోయిన్ పూనమ్ కౌర్ తన 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. పవన్ ఫ్యాన్స్ తనపై సామాజిక దాడి చేయడం మంచిది కాదన్నారు కత్తి. ప‌వ‌న్ -తాంత్రిక పూజ‌లు ఎందుకు నిర్వ‌హించారో చెప్పాలని ఆరు ప్ర‌శ్న‌లు సంధించారు. ఇందులో ఒక ప్రశ్నకు అప్పుడే సమాధానం వచ్చింది. 

పూనమ్ కౌర్ కు కత్తి మహేష్  సంధించిన  ఆ ఆరు ప్ర‌శ్నలు ఇవే… 

1. మీకు ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది?
2. తిరుమలలో పవన్ పక్కనే నిల్చొని ఒకే గోత్రనామాలతో ఎందుకు పూజ చేయించుకున్నారు?
3. పవన్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న ఆసుపత్రి ఏది? ఆ బిల్స్ కట్టింది ఎవరు?
4. పవన్ కల్యాణ్ గారు మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటివరకు అది నెరవేర్చారా? లేదా?
5. డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం?
6. క్షుద్రమాంత్రికుడు నర్సిహం చేసిన పూజల్లో త్రివిక్రమ్‌, పవన్‌, మీరు ఎందుకు పాల్గొన్నారు? అక్కడ మీరు ఏం చేశారు?
ఈ ఆరు ప్రశ్నలకు పూనమ్ కౌర్ సమాధానం చెప్పిన తర్వాతే దీనిపై చర్చ పెట్టుకుందామని కత్తి మహేష్ అనడంతో అసలు వివాదం పైకి వచ్చింది. 
అసలు పవన్ కల్యాణ్ కు నాలుగో భార్యగా ఉండేందుకు పూనమ్ కౌర్ ముందుకు వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో కత్తి మహేష్ వేసిన ఆరు ప్ర‌శ్న‌లు ఆసక్తికరంగా మారాయి.
ఒక ప్రశ్నకు సమాధానం…
ప్రశ్న….క్షుద్రమాంత్రికుడు నర్సిహం చేసిన పూజల్లో త్రివిక్రమ్‌, పవన్‌, మీరు ఎందుకు పాల్గొన్నారు? అక్కడ మీరు ఏం చేశారు?
సమాధానం…ఈ ప్రశ్నకు పూనం కౌర్ నుంచి సమాధానం రాలేదు. కానీ ఆ రోజు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూనం కౌర్ లు కలిసి పూజలు చేయించుకుంది నిజమేనని పూజారి న‌ర్సింహం అన్నారు. జ‌ల్సా షూటింగ్  స‌మ‌యంలో  ద్వారాకా తిరుమ‌ల ఐఎస్ జ‌గ‌న్నాథ‌పురం ల‌క్ష్మీ న‌ర‌సింహా స్వామి దేవాల‌యంలో ఈ పూజ‌లు జ‌రిపించార‌ని అన్నారు. ఆ దేవాలయంలో 24గంట‌లు పూజ‌లు, యాగాలు చేయోచ్చ‌ని ..ప‌వ‌న్ క‌ల్యాణేకాదు , మ‌హేష్ బాబు, ప‌లు ప్ర‌ముఖులు పూజ‌లు చేస్తార‌ని ఆయన అన్నారు. యాగం 24గంట‌లు చేసే సౌక‌ర్యం ఉంది. అర్థరాత్రి చేస్తే ఫలితాలు బాగా ఉంటాయనే ఆలోచనతోనే ఈ పని చేసారన్నారు. అంతే కాదు…పగలు అయితే ప్యాన్స్ తో ఇబ్బంది వస్తుందని రాత్రి పూట చేశారని చె్పపారు.  ఆ స‌మ‌యంలో పూజారి న‌ర‌సింహా ద‌గ్గ‌రుండి ప‌వ‌న్ క‌ల్యాణ్ , త్రివిక్ర‌మ్ లతో ఆ పూజ చేయించిన‌ట్లు తెలిసిందే. కానీ అవి క్షుద్ర పూజలు కాదంటున్నారు పూజారి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*