చంద్రబాబు పై పెరుగుతున్న విమర్శల దాడి…

రాజకీయాలు వేరు. వ్యక్తిగతం వేరు. సిపిఐ నారాయణ మొన్ననీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సి.ఎం చంద్రబాబుతో కలిసి విజయవాడలో విశాలాంధ్ర బుక్ స్టాల్స్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆరోజు నారాయణ భుజం మీద చేయి వేసి మరీ సరదగా మాట్లాడారుచంద్రబాబు. అంతే అంతా టీడీపీ, సిపిఐలు బాగా కలిసిపోయాయి అన్నారు. కానీ ఇప్పుడు అదే నారాయణ సి.ఎం చంద్రబాబు పై దారుణమైన కామెంట్లు చేస్తున్నాడు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు తోక జాడిస్తే వెంటనే బాబు జైలుకు వెళ్లవలసి వస్తుందన్నారు. చంద్రబాబును మోడీ జైలుకు పంపిస్తారని నారాయణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

ఓటుకు కోట్లు కేసు చూపించి చంద్రబాబును మోడీ ఓ ఆట ఆడుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు చేసిన పనికి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఏవీ పరిష్కారం కావడం లేదన్నారు నారాయణ. కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతోందని సిపిఐ నేత ధ్వజమెత్తారు. చంద్రబాబుది ప్రస్తుతం బానిస బతుకైందని చెప్పడం హాట్ టాపికైంది. ప్రధాని మోడీ కావాలని అపాయింట్ మెంట్ ఇవ్వకపోయినా ఏమి చేయలేని పరిస్థితి చంద్రబాబుది.

అదే సమయంలో తనపార్టీ ఎంపీలను పంపి మరీ చంద్రబాబు అపాయింట్ మెంట్ గురించి ప్రస్తావించడం మరింత ఆశ్చర్యం. ఒక రాష్ట్ర సి.ఎం అపాయింట్ మెంట్ కోసం ఇంతలా అడగడం ఎప్పుడూ లేదనే రఘవీరారెడ్డి లాంటి నేతలు ప్రస్తావించారు. ఎంపీలను పంపించి వేడుకుంటే కాని అప్పాయింట్ మెంట్ దొరకలేదని రఘవీరారెడ్డి అన్నారు. ధవళేశ్వరం నుంచి పోలవరానికి ఆయన పాదయాత్ర చేపట్టిన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా పై అటు వెంకయ్యనాయుడు, ఇటు చంద్రబాబులు పూటకో మాట చెప్పి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని ప్రస్తావించారు. హోదా కావాలని ఒకసారి, ప్రత్యేక హోదా సంజీవినా అని మరోసారి, హోదా కంటే ప్యాకేజి కావాలని ఇంకోసారి ఇలా చంద్రబాబు మాటి మాటి మాట మార్చడం వల్ల ఇబ్బంది పడక తప్పదని హెచ్చరించారు. 

పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అన్నారు రఘవీరా. చంద్రబాబు గతంలో లాగ ప్రధాని మోడీతో రహస్య భేటీలు జరిపితే కుదరదన్నారు. వారి మధ్య ఏం జరిగిందో లైవ్ ఇవ్వాలన్నారు. సిపిఐ, కాంగ్రెస్ లు చంద్రబాబు తీరును తప్పుపడితే ఇక వైకాపా ఊరుకుంటుందా నిప్పులు చెరిగింది. రోజా, అంబటి లాంటి నేతలు విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీని అడుక్కోవాల్సి వస్తుందని….అందుకే ఏపీకి వారు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

రాబోయే కాలంలో తమ పార్టీ 175 సీట్లలో పోటీ చేస్తుందని ఇంకోవైపు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ పెద్దల సూచనతోనే ఆమె ఈ మాటలన్నారంటున్నారు. విషయం ఏదైనా చంద్రబాబు, మోడీ భేటీతో రాష్ట్ర సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశముంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*