చంద్రబాబు నకిలీ లేఖ, ఐఏఎస్ లలో కలకలం

తాము లేఖ రాయలేదు. కానీ వారి పేరుతో లేఖలు సి.ఎం చంద్రబాబునాయుడుకు అందాయి. ఫలితంగా ఏది నిజమో. ఏది అబద్దమో అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్ లోని ఐఏఎస్ ల పరిస్థితి ఇది. ఐఏఎస్‌ అధికారుల సంఘం లెటర్‌హెడ్‌ను ముద్రించి వారు రాసినట్లు ఒక లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకే పంపించారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మార్చి 31నాటికి వందశాతం మరుగుదొడ్లను నిర్మించాలని సి.ఎం చంద్రబాబు అన్నారు. అది పూర్తి చేయకపోతే జిల్లాల్లో కలెక్టర్లకు వ్యతిరేకంగా ధర్నా చేస్తానని.. అప్పటికైనా వారికి రోషం వస్తుందని అన్నారు. పనితీరు మరింతగా మెరుగుపడాలనే ఆలోచనతోనే చంద్రబాబు చెప్పారు. 

మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చెప్పిన మాట ఇది. దీనికి ఐఏఎస్‌ అధికారుల సంఘం పేరుతో సీఎంకు ఒక లేఖ అందింది. మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం విడుదల చేసింది రూ.992.06 కోట్లు, రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది 838.16 కోట్లు. మొత్తం 1830.22కోట్లలో కేవలం 1230.22 కోట్లు ఖర్చుచేశారు. మిగతా నిధులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేశారని ఆలేఖలో ప్రస్తావించారు. ఐఏఎస్‌ అధికారుల్లో ఏమైనా లోపాలుంటే బదిలీ చేసినా ఫర్వాలేదు. కానీ ఇలా తమను నిందిస్తే ఇబ్బంది అని… ఆవేదనను అర్థం చేసుకోవాలని వారు లేఖను ముగించారు.

ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఐఏఎస్‌ అధికారుల సంఘం బహిరంగం లేఖ రాసిందా అనే చర్చ మొదలైంది. తీరా అసలు విషయం ఏంటంటే… తమ సంఘం లెటర్‌హెడ్‌లా నకిలీది ముద్రించారని తేలింది. ముఖ్యమంత్రికి తాము ఎలాంటి లేఖ రాయలేదని ఐఏఎస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌ అధికారుల సంఘం చంద్రబాబు తీరుపై ఘాటు లేఖాస్త్రం సంధించిందని ప్రచారం వస్తోంది. తీరా అది నిజం కాదని తెలుసుకుని అటు ఐఏఎస్ అదికారులే కాదు..సిఎం చంద్రబాబు అవాక్కయ్యారు. 

నకిలీ లేఖలు రాయడం, సృష్టించడం, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం ఒక పార్టీ మాత్రమే చేస్తుందని..అందుకే అంతా జాగ్రత్తగా ఉండాలని సి.ఎం చంద్రబాబు అధికారులకు సూచించారట. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*