‘కత్తి’ వేటు వెనుక వైఎస్సార్ కాంగ్రెస్!

పవన్ కల్యాణ్ ను బద్నాం చేయడంలో.. ఆయన రాజకీయ విధానాలను మాత్రమే ప్రశ్నిస్తున్నా… ఆయన వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లడం లేదు.. అని పైకి ప్రకటిస్తూ.. అన్ని రకాలుగానూ పవన్ కల్యాణ్ ను డీఫేమ్ చేయడానికి శక్తివంచన లేకుండా.. కృషి చేస్తున్న ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్. పవన్ కు వ్యతిరేకంగా.. ఒక గళం వినిపించడం.. అది కాస్తా వివాదంగా మారడంతో.. ఆ వివాదం పూర్తిగా ముదిరి.. ఒకరి మీద ఒకరు వ్యక్తిగత నిందలు, దూషణలు చేసుకోవడం వరకు వెళ్లడంతో.. మీడియా మొత్తం దీనిమీదే ఫోకస్ పెట్టింది. నేను పవన్ కల్యాణ్ రాజకీయ విధానాలను మాత్రమే ప్రశ్నిస్తున్నా అని చెప్పుకుంటున్న కత్తి మహేష్.. పనిలో పనిగా సందు దొరికినప్పుడెల్లా తెలుగుదేశాన్ని కూడా తూర్పార పట్టేస్తున్నారు. నిందలు వారికి కూడా సోకేలా మాట్లాడుతున్నారు. అయితే రాజకీయ, సినిమా పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సంగతి ఏంటంటే.. కత్తి మహేష్ వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ వారి ప్రోత్సాహం ఉన్నదని!

వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎంత కాదనుకున్నా.. పవన్ కల్యాణ్ మీద.. ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఉంది. తాను ఏ పార్టీకి వ్యతిరేకంకాదని.. పవన్ బహిరంగసభల్లో చెబుతున్నా.. వైకాపా అధికారంలోకి రాకుండా చూడాలనే ఉద్దేశంతోనే.. చంద్రబాబునాయకత్వానికి జై కొడుతున్నారనేది జగన్ మరియు ఆయన అనుచరుల్లో ఉన్న అనుమానం. దీనికి కౌంటర్ గా అసలు తెలుగు ప్రజల్లో పవన్ కల్యాణ్ కు ఉన్న క్రెడిబిలిటీనే దెబ్బతీస్తే సరిపోతుందని వారు వ్యూహాత్మకంగా కత్తి ని తమ అస్త్రంగా ప్రయోగిచింనట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి.

ఒక్కో శత్రువు మీదికి ఒక్కొక్క అస్త్రాన్ని తయారుచేసి సంధించి వదిలేయడం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూలాల్లోనే ఉన్న యుద్ధనీతి. ఆ పార్టీ వారి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అనుసరించే యుద్ధ వ్యూహం అలాగే ఉండేది. ఆయన తన ప్రత్యర్థుల మీద పోరాడే బాధ్యతను తన కోటరీలోని వ్యక్తులకు విడివిడిగా అప్పగించేసేవారు. వారు తమ జీవిత పర్యంతమూ అదే పోరాట ఎజెండాతో ఉండేవారు. ఆ రకంగా… రామోజీ రావు మీద పోరాడడానికి ఉండవల్లిని, అప్పట్లో చంద్రబాబు మీద విమర్శలు చేయడానికి మంత్రి మారెప్పను ఇదే విధంగా వైఎస్సార్ తయారుచేసుకున్నారు.

తండ్రి యుద్ధవ్యూహాల అడుగుజాడల్లోనే జగన్ కూడా ఇలా నడుచుకుంటున్నట్లు అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ ను బద్ నాం చేసే బాధ్యతను పూర్తిగా కత్తి మహేష్ కు అప్పగించేసి.. వారు గట్టున ఉండి చోద్యం చూస్తున్నారు. సినీ విమర్శకుడిగా గుర్తింపు ఉన్న కత్తి మహేష్ రాజకీయ విమర్శలు చేస్తున్నానంటూ.. పవన్ మరియు తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నారే తప్ప.. వైఎస్సార్ కాంగ్రెస్ గురించి నోరు మెదపక పోవడం కూడా ఇలాంటి సందేహాలను బలపరుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*