టచ్ చేసి చూడు అంటున్న రవితేజ

         మాస్ మహరాజు రవితేజ తిరిగి జోరందుకుంటున్నాడు. బెంగాల్ టైగర్ ఆశించినంత లేకపోయినా పోయినేడు వచ్చిన రాజాది గ్రేట్ సినిమాతో విజయం అందుకున్నాడు. ఇప్పుడు ఆయన త్వరలోనే ‘టచ్‌ చేసి చూడు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దర్శకత్వం విక్రమ్‌ సిరికొండ. ఇందులో రవితేజకు జోడిగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. ఇందులో రవితేజ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. గొడవ చేస్తున్న వారిని పోలీసులు చెదరగొడుతున్నారు. అప్పుడే  ఓ వ్యక్తి మెడలో టైరు వేసి రవితేజ ఈడ్చికొస్తుంటాడు. పక్కనే గుర్రాలు ఉంటాయి. రవితేజ లుక్ బాగుంది. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై నల్లమలపు శ్రీనివాస్‌(బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ సంగీత దర్శకుడు ప్రీతమ్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా…ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్దమవుతోంది. 
         నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘అ!’ చిత్రంలో ఓ చెట్టుకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు రవితేజ. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. మాళవిక శర్మ ఇందులో కథానాయిక. రామ్‌ తుళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘నేల టికెట్‌’ అనే పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 
        1991లో కర్తవ్యం మూవీతో సినీ పరిశ్రమలోకి వచ్చినా అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర, బలాదూర్,బలుపు,పవర్, దరువు, దుబాయ్ శీను, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం, లాంటి పెద్ద పెద్ద విజయాలు హీరోగా నమోదు చేసుకున్నారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో మాస్ సినిమాలకు రవితేజ అడ్డగా మారాడు. ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు రవితేజ. ఫలితంగా ఆయన జోరు పెరగనుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*