చంద్రబాబును మాట్లాడుకుందాం రమ్మన్న మోడీ

         ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈనెల 12వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. ఈమేరకు ప్రధానితో చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఖరారైందని పీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ మధ్య చాలా సార్లు హస్తినకు వెళ్లినా ప్రధాని మోడీని కలవకుండానే చంద్రబాబు వస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి సంబంధించిన చాలా విషయాల పై టీడీపీ, బీజేపీ ఎంపీలు ఏకరవు పెట్టిన సంగతి తెలిసిందే. నేను ఉన్నాను. అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తానని మోడీ హామీనిచ్చారు. అదే సమయంలో చంద్రబాబు అపాయింట్ మెంటు అడిగారు. కలుద్దామని రమ్మని చెబుతానన్నారు. అంతే కాదు. సంక్రాంతికి ముందే మాట్లాడుకుందాం రమ్మని చెప్పారు. 
        ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బీజేపీ, టీడీపీల మధ్య విభేదాలొచ్చాయని, అందుకే చంద్రబాబుకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదనే వార్తలొచ్చాయి. ప్రత్యేక హోదా, ప్యాకేజి, విభజన హామీలు, పోలవరం, రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్ వంటి  అంశాలు వీరిమధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు రానున్న ఎన్నికల్లో పొత్తుల పైనా వారు మాట్లాడుకుంటారని సమాచారం వస్తోంది. ఫలింతగా వారిద్దరి మధ్యజరిగే భేటీ పై ఆసక్తి పెరుగుతోంది. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*