మంత్రి నారా లోకేష్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన…

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గోదావరి జలాలు శుద్ధి పరచి సూర్యారావు పేట మరియు 16 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు 15 కోట్ల రూపాయిల వ్యయంతో నిర్మించిన సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా తాగునీటి సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం

అందుకే మంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే 2019 నాటికి రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చెయ్యాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాను

రాజధాని లేకుండా  నాలుగో సారి మనల్ని కట్టుబట్టలతో బయటకి గెంటేసారు

16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చెయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు ఎక్కువుగా కేటాయిస్తున్నారు

రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి కులాయి ద్వారా తాగునీటి ని అందించాలి అనే లక్ష్యంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చేపడుతున్నాం

22 వేల కోట్లు అంచనా వ్యయంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చేపడుతున్నాం

ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రతి ఇంటికి కులాయి ద్వారా తాగునీటిని అందించేందుకు 2,300 కోట్లు ఖర్చు చెయ్యబోతున్నాం

మొదటి దశ గా 10 వేల కోట్లు సమీకరించి వాటర్ గ్రిడ్ పథకం పనులు ప్రారంభిస్తున్నాం

గతంలో పాలకులు జిఓలు ఇచ్చారే తప్ప పనులు చెయ్యలేదు

పెండింగ్లో ఉన్న గ్రామీణ నీటి సరఫరా పనులు అన్ని వెంటనే పూర్తి చెయ్యాలి అని ఆదేశాలు జారీ చేసాను

ఓవర్ హెడ్ ట్యాంక్స్ లో సెన్సార్లు ఏర్పాటు చేసి నీటి నాణ్యత పర్యవేక్షించబోతున్నాం

ఓవర్ హెడ్ ట్యాంక్స్ మరమ్మతుల కోసం 45 కోట్లు కేటాయించాం

రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కరించిన తరువాతే మీ ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తాను…

మంత్రి నారా లోకేష్

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*