పోయిన ట్రాన్స్ ట్రాయ్ పరువు…

         డబ్బులు తీసుకున్నారు. తిరిగి చెల్లించడంలేదు. ఫలితంగా బ్యాంకు రుణం తీసుకున్న వారికి నోటీసులు ఇచ్చింది. అయినా వారు స్పందించలేదు. ఇవాళ రేపు అంటూ వాయిదా వేస్తోంది. అనేక సార్లు ఇదే విషయం పై మాట్లాడారు. ఫలితం లేదు. రుణం తీసుకున్న వారు అధికార పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కావడంతో వారు చాలా రోజుల పాటు ఆగారు. తమ బ్యాంక్ యాజమాన్యం నుంచి వారికి చిక్కు వచ్చి పడింది. అందుకే అంతా రంగంలోకి దిగారు. కోట్లాది రూపాయల రుణం తీసుకొని, తిరిగి చెల్లించకుండా మొండికేసిన వారికి తమ ప్రతాపం చూపించింది. తమ వద్ద రుణం తీసుకున్న కంపెనీ వద్దకు వెళ్లి యంత్రాలను సీజ్ చేయడంతో విషయం బయటకు పొక్కింది. 
            పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ దేనా బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. మొత్తం 64 వాహనాల కోసం దేనా బ్యాంకు నుంచి ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ తీసుకున్న రూ.84 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించలేదు. ఫలితంగా ఆ వాహనాలను బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ తీసుకున్న అప్పుపై రూ.36కోట్ల వడ్డీ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో అసలు, వడ్డీ కలిపి రూ. 120కోట్లు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఆదేశించారు. ఆ నిర్మాణ సంస్థకు చెందిన మూడు యంత్రాలు పోలవరంలో పని చేస్తుండగా… సీజ్‌ చేశారు. 
         ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ట్రాన్స్‌ట్రాయ్‌పై చర్యలు తీసుకోకుండా బ్యాంకు అధికారులతో మాట్లాడారు. సమస్యను తీరుస్తామని చెప్పారు. ఫలితంగా బ్యాంక్ సిబ్బంది అక్కడ నుంచి వెళ్లిపోయారు. సెక్షన్‌ 14 సర్‌ప్లస్‌ యాక్ట్‌ ప్రకారం కోర్టు అనుమతితో ట్రాన్స్‌ట్రాయ్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది బ్యాంక్. ఇప్పుడే కాదు..రాబోయే రోజుల్లోను ఆ బ్యాంక్ నుంచి ఇబ్బందులు తప్పవంటున్నారు. 
 

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*