పవన్ కల్యాణ్ ను ఘాటుగా హెచ్చరించిన కత్తి మహేష్

          పవన్ కల్యాణ్ అంటే చాలు క్రిటిక్ రైటర్ మహేష్ కత్తి దూకుడు మంత్రం పఠిస్తాడు. పవన్ కంటే ప్రిన్స్ మహేష్ నటన చాలా బాగుంటుందని చెప్పారు. అసలు పవన్ కు నటన చేతగాదనే తేల్చేశాడు కత్తి మహేష్. రాజకీయాలకు అసలు పవన్ సూటు కాడని చాలా సార్లుచెప్పాడు. అలా అంటే ప్యాన్స్ ఊరుకోరు కదా.. కత్తి మహేష్ పై దుమారం రేపారు. చంపేస్తామని బెదిరించారు. ఎవరు ఎన్ని చెప్పినా కత్తి మహేష్ వెనక్కు తగ్గలేదు. తన మాటల దాడిని కొనసాగిస్తున్నాడు. ఒకవైపు వర్మ కామెంట్లు, మరోవైపు కత్తి మహేష్ ట్వీట్లతో పవన్ కల్యాణ్ కు కోపం వచ్చినట్లు ఉంది. వ్య‌క్తిత్వంలో నిన్ను ఓడించ‌డం చేత‌కాని వాళ్లు.. నీ కులం, ధ‌నం, వ‌ర్ణం గురించి మాట్లాడ‌తారు` అని ట్వీట్ చేశాడు పవన్. ఈ ట్వీట్‌కు వెంట‌నే మ‌హేష్ క‌త్తి ఘాటుగానే స్పందించాడు.

            `కులం, ధ‌నం, వ‌ర్ణం గురించి మాట్లాడుతోంది నీ ఫ్యాన్స్‌, ఫ్రెండ్స్ & గాళ్‌ఫ్రెండ్‌. నేను కాదు. కాబ‌ట్టి పెట్టే గ‌డ్డేదో వాళ్ల‌కి పెట్టు. ఇక వ్య‌క్తిత్వం గురించి అంటావా అది నువ్వు మాట్లాడ‌క‌పోతేనే బెట‌ర్‌. అన‌వ‌స‌రంగా క‌డుపు చించుకుంటే కాళ్ల మీద ప‌డుతుంది. జాగ్ర‌త్త‌!` అని ట్వీట్ చేశాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్ పై చాలా విమర్శలు వచ్చాయి. అతని తీరులోను తేడా వచ్చింది. అందుకే వ్యక్తిత్వం గురించి మాట్లాడవద్దని హెచ్చరించారు కత్తి మహేష్.

              ఏ ఎండకు ఆ గొడుగులా మారాడు పవన్ కల్యాణ్. ఫలితంగా అతని మాటలకు విలువ తగ్గింది. చంద్రబాబు, కేసీఆర్ లను పల్లెత్తు మాట అనని పవన్ తీరును వైరి వర్గం తప్పుపడుతోంది. పార్టీ పిరాయింపుల విషయంలో పవన్ కల్యాణ్ నోరు పడిపోవడం విమర్శలకు తావిస్తోంది. వెంకయ్యనాయుడుతో పాటు..టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి తదితరులను వ్యక్తిగతంగా విమర్శించాడు పవన్ కల్యాణ్. ఆతర్వాత వారితోనే బాగా చనువుగా ఉంటున్నాడు.

         ఒకప్పుడు కేసీఆర్ తాట తీస్తాను అన్న పవన్ కల్యాణ్ తన అవసరం వచ్చేసరికి కేసీఆర్ అంత మొనగాడు లేడని ప్రశంసించారు. ఫలింతగా పవన్ కల్యాణ్ గుడ్ విల్ డ్యామేజ్ అయింది. అందుకే కత్తి మహేష్ లాంటి వారికి చులకనయ్యాడు పవన్. మరో ప్రజారాజ్యంలా పార్టీ మారకుండా చూసుకుంటే మంచిదేమో అంటున్నారు జనాలు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*