జగన్ పై సెటైర్లతో గర్జించనున్న ‘జైసింహా’

ఈ సంక్రాంతి బరిలోకి జైసింహా అంటూ బాలయ్య తొడకొట్టి రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అనేక విశేషాలు ముదునుంచే సంచలనాలు సృష్టిస్తున్నాయి. బాలయ్య మెకానిక్ గా కనిపించే ఈ చిత్రంలో ప్రేమ, ఎమోషన్ కుటుంబ సంబంధాలు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ లు, బ్రాహ్మణులకు అనుకూలంగా భారీ డైలాగులు.. బ్రాహ్మణుల ఔన్నత్యాన్ని సమాజానికి తెలియజెప్పే సందేశాత్మక డైలాగులు ఉంటాయని కూడా అనుకుంటున్నారు.

అయితే ఇక్కడే మరో కీలకమైన సంగతి కూడా విశ్వసనీయంగా తెలుస్తోంది. బాలయ్య నుంచి అభిమానులు ఆశించే విధంగా కొంత పొలిటికల్ టచ్ కూడా సినిమాకు ఉంటుందని అంటున్నారు. విశాఖ ఆర్ కె బీచ్ లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ఇక్కడ బాలయ్య చాలా భారీ డైలాగులు చెప్పారని ఫ్యాన్స్ అందరికీ మహా కిక్ ఇచ్చేలాగా ఈ సీన్ ఉంటుందని అంటున్నారు. ఈ ఎపిసోడ్ లో చాలా డైలాగులు జగన్ మీద సెటైర్లుగా ఉంటాయని తెలుస్తోంది.

సంక్రాంతి బరిలోకి దిగుతుండడంతో బాలయ్య ఫ్యాన్స్ దీనికోసం క్రేజీగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది సంక్రాంతి బరిలో కూడా బాలకృష్ణ విజయవంతం అయిన చిత్రంగా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’తో ప్రేక్షకులను అలరించారు. సాధారణంగా సంక్రాంతికి సినిమాతో వచ్చిన మరే హీరో మరో సంక్రాంతికి మరో చిత్రంతో రావడం.. ఈ మధ్యలో ఇంకొక చిత్రాన్ని చేయడం ఈ సంవత్సరంలో జరగలేదు. అలాంటిది బాలయ్య మాత్రం 2017 సంక్రాంతి తో పాటు, 2018 సంక్రాంతికి కూడా ‘జైసింహా’తో వస్తుండగా… మధ్యలో ‘పైసా వసూల్’ చిత్రం కూడా చేశారు. పైసావసూల్ కాస్త అభిమానుల్ని నిరాశపరచింది. అంతలోనే మళ్లీ సంక్రాంతికి మరో చిత్రంతో వస్తున్న బాలయ్య ది వన్ అండ్ ఓన్లీ ఎనర్జిటిక్ హీరో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఈ చిత్రం యాక్షన్ ప్రధానంగా సాగడంతో పాటూ కుటుంబ విలువలకు కూడా పెద్దపీట వేసేలా ఉంటుందని సినిమా యూనిట్ ద్వారా తెలుస్తోంది.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*