ఎపిలో రూపాయికే ఇళ్లు నిర్మాణం..

       రూపాయికే కిలో బియ్యం సంగతి తెలుసు. కానీ రూపాయికే ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తారట మంత్రి నారాయణ. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయనకు పేదల సంగతులు తెలుసుకుని బాధపడ్డారు. అందుకే నిరుపేదలకు కేవలం దరఖాస్తు ఖర్చులుగా ఒక్కరూపాయి చెల్లిస్తే చాలు. 238 చదరపు అడుగుల్లో సుమారు 3 లక్షల రూపాయల వ్యయంతో సొంత ఇల్లు నిర్మించి ఇచ్చేస్తాం అని చెప్పారు. కానీ అధికారికంగా కాదు. ఈ విషయాన్ని సి.ఎం చంద్రబాబునాయుడుకు చెప్పి ఒప్పిస్తానని అంటున్నారు మంత్రి నారాయణ. కొత్త పథకాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించాలి. కానీ ఆ పని చేయకుండా మంత్రి నారాయణ తనను కలిసిన పేదలకు హామీలివ్వడం పై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. చంద్రబాబు ఆ మాట చెప్పాలి. కానీ మంత్రి ఎలా చెబుతారనే చర్చ సాగుతోంది. 
         ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార, విపక్షాలు అమలు సాధ్యం కానీ హామీలుఇస్తున్నాయి. అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇస్తామని చెబుతున్నారు సి.ఎం చంద్రబాబు. కానీ 45 ఏళ్లు దాటిన అందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు ఇంకోవైపు జగన్. ఇదంతా ఓట్ల కోసం వేసే గాలం అని అందరికీ తెలుసు. అయినా సరే. ఎవరికి వారే తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మాటలను జనాలు వింటారా లేదా అన్నది తేలాలి.  ఏనాడు సర్పంచ్ గా నైనా గెలవని నారాయణ ఫండ్స్ ఇచ్చారని..అందుకే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రిని చేశారనే ప్రచారముంది. ఎన్నికల సమయంలో నారాయణ విద్యా సంస్థల నుంచి వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టారని..అందుకే మంత్రి పదవి ఇచ్చారనేది ఆయన పై వచ్చే కామెంట్. ఇందులో నిజంలేదని నారాయణే కాదు..టీడీపీ నేతలు చాలా సార్లు ఖండించారు. ఇప్పుడు ఆయనే చంద్రబాబుకు తెలియకుండా కొత్త పథకాలను ప్రకటించడం హాట్ టాపికైంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*