మోడీతో భేటీ కానున్న చంద్రబాబు

      ఆంధ్రప్రదేశ్ సి.ఎం చంద్రబాబునాయుడు అపాయింట్ మెంట్ అడిగినా ప్రధాని నరేంద్ర మోడీ కలిసేందుకు ఇష్టపడటంలేదనే ప్రచారం జరుగుతోంది. రెండేళ్లుగా హస్తినకు వెళుతున్న సి.ఎం ప్రధానిని కలవకుండానే తిరిగి వస్తున్నారు. ఫలితంగా టీడీపీ-బీజీపీ మధ్య సంబంధాలు తగ్గిపోయాయనే ప్రచారం జరిగింది. ఈసారి టీడీపీ ఎంపీలు అపాయింట్ మెంట్ అడగడమే ఆలస్యం. మోడీ సరేనన్నారు. అంతే నేతలంతా వెళ్లి కలిశారు. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, పెండింగ్ ప్రాజెక్టులు, చేయాల్సిన సంగతులను ప్రస్తావించారు. 
         ఆ తర్వాత ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిమ్ములను కలిసేందుకు సిద్దంగా ఉన్నారని గుర్తు చేశారు. ఇందుకు మోడీ సుముఖత వ్యక్తం చేశారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని, రాష్ట్రానికి అండగా ఉంటానని చెప్పారు మోడీ. అంతే కాదు..ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పాయింట్ మెంట్ అడిగారు, రెండు ,మూడురోజులలో సమావేశం అవుతానని వారికి చెప్పారు మోడీ. ఫలితంగా చంద్రబాబు త్వరలోనే ప్రధాని మోడీని కలిసి వాస్తవ పరిస్థితులను చెబుతారంటున్నారు. అంతే కాదు..ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ ను సందర్శిస్తారని..పోలవరం ప్రాజెక్టును చూస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 
        పనిలో పనిగా పొత్తుల అంశం వారి మధ్యన చర్చకు వచ్చే అవకాశముంది. రాజకీయాంశాలతో పాటు..జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం వారు చర్చించే వీలుందంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*