నేను తప్పు చేశాను.. మీరు చేయకండి.. ప్రదీప్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు చిక్కిన ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ ఎక్కడకు వెళ్లాడనే చర్చ సాగుతోంది. ఆ రోజు పోలీసులు కేసు నమోదు చేసుకుని కౌన్సిలింగ్ కు హాజరు కావాలని చెప్పారు. వరుసగా నాలుగు రోజుల పాటు అతను కౌన్సిలింగ్ కు రాకపోవడంతో అసలు ఎక్కడకు వెళ్లాడు. ఏంటనే విషయం పై చర్చ సాగుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో ప్రదీప్‌ పట్టుబడ్డాడు. అతడు అధిక మోతాదులో మద్యం తాగినట్టు (178ఎంజీ/100ఎంల్‌) పరీక్షలో తేలింది. ఫలితంగా అతని వాహనాన్ని సీజ్‌ చేసిన పోలీసులు.. బేగంపేట ట్రాఫిక్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌లో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని చెప్పి వదిలిపెట్టారు. మరో కారు ద్వారా అక్కడి నుంచి వెళ్లి పోయిన ప్రదీప్‌  కౌన్సిలింగ్‌కు హాజరు కాలేదు. ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఉంది. ఆ రోజు సిటీలో చిక్కిన 1477 మంది మందుబాబుల్లో అతనొకరు. కాబట్టి గడువు ఇచ్చామని చెప్పారు పోలీసులు.
                              ఈ ఉత్కంఠకు తెరదించాడు ప్రదీప్. తాను ఎక్కడకు వెళ్లలేదని చెప్పాడు. తనకు షూటింగ్ లు ఉండటం వల్ల బిజీగా ఉన్నానని చెప్పాడు. అంతే తప్ప తప్పించుకు తిరిగే రకం తాను కాదన్నారు. అసలు ఏమంటున్నాడో ప్రదీప్ మాటల్లోనే విందాం…
                               ‘అందరికీ నమస్కారం.. నేను మీ ప్రదీప్ మాచిరాజు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఏం జరిగిందో అందరికీ తెలుసు. దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్స్‌ను చట్ట ప్రకారమే ఫాలో అవుతాను. నాకు వచ్చిన సూచనల ప్రకారం పోలీస్ కౌన్సెలింగ్ కానీ, దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్‌కు హాజరు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే ఈలోగా నేను ముందుగానే కమిట్ అయిన ప్రోగ్రామ్స్, ఇతర ఈవెంట్ల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. అందువల్ల నేను అందుబాటులో లేనంటూ కొందరు ఆందోళన చెందుతున్నారు. తెలియజేసేది ఏమంటే షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్లనే కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయాను.
                              కంటిన్యూగా ఫోన్ మోగడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అయుండొచ్చు. దయచేసి మీడియా మిత్రులకుగానీ, ప్రేక్షకులకు గానీ తెలియజేయడం ఏమనగా.. చట్ట ప్రకారం అన్ని ప్రొసీడింగ్స్ ఫాలో అవుతాను. గతేడాది డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఓ వీడియో గురించి చెప్పాను. అవును.. దురదృష్టవశాత్తూ నేను అందులో లభించాను. నేను తెలియజేసేది ఏమంటే.. నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదని కోరుకుంటున్నాను. అందరూ నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నానంటూ’ ప్రదీప్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఫలితంగా ఇది అందరికీ షేర్ అవుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*