దుర్గ గుడిలో పూజలు జరిగింది నిజమే నా…

దుర్గ గుడి ఆలయంలో ఏం జరగలేదు. తొలిరోజు అధికారుల నుంచి వచ్చిన మాట. ఇతర ఆలయంలో పని చేసే పూజారి వచ్చాడు రెండో రోజు అదే అధికారులు చెప్పిన సంగతి. ఆలయంలో శుద్ది మాత్రమే జరిగింది అన్నారు. ఆ తర్వాత అమ్మవారికి అలంకరణ మాత్రం చేశామన్నారు. అసలు సంగతి ఏంటంటే ఎవరు లేకుండా ఆలయ గర్భగుడి తెరిచి పూజలు చేశారు.ఈ విషయాన్ని పోలీసులు తమ విచారణలో నిర్థారించారు. అయినా తప్పు ఒప్పుకునేందుకు అధికారులు సిద్దంగా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. దుర్గగుడిలో అనధికార పూజలపై ఆలయ అధికారులు రోజుకో మాట చెబుతూ దాటేస్తున్నారు. డిసెంబరు 26వ తేదీ రాత్రి ఆలయ నిబంధనలకు విరుద్ధంగా పూజలు చేసింది నిజమని అక్కడ పని చేసే పూజారులే కాదు.. సీసీ టీవీ దృశ్యాలు చెబుతున్నాయి. బుకాయించిన నిజం దాగదు. సిఎం చంద్రబాబునాయుడు, మంత్రి మాణిక్యాలరావు, ఈవో సూర్యకుమారి, పోలీసు ఉన్నతాధికారులు వివిధ రకాలుగా విచారించారు. మొత్తంగా పూజలు జరిగింది నిజమేనని నిర్థారించారు. 
                          కాకపోతే ఆ పూజలు ఎందుకు చేశారనేది ఇంకా తేల్చలేదు. ఆలయంలో అసలు ఎలాంటి పూజలూ జరగలేదని ఈవో సూర్యకుమారి ఇప్పటికీ చెబుతోంది. ఆలయానికి సంబంధం లేని అర్చకుడు’ పార్థసారథి అలియాస్‌ రాజా గర్భగుడి వద్ద గుమ్మడికాయ ఉన్న పళ్లెంతో లోపలికి వెళ్లిన సంగతులు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపికయ్యాయి. ప్లాస్టిక్‌ కవర్‌లో పూజాసామగ్రి, మరికొన్ని వస్తువులతో అంతరాలయంలోకి వెళ్లారు. రాత్రి 10.03 నుంచి 10.55 గంటల మధ్య ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పూజలే జరగలేదని బుకాయించడం వల్ల తప్పు ప్రభుత్వం వైపు వస్తోంది. ఈ పూజల్లో పాల్గొన్న పార్థసారథి, సుజన్‌లను పోలీసులు పలు రకాలుగా విచారించారు. ఏం జరిగిందో వారు వివరించారు. అర్చకుల కాల్‌డేటాను అధికారులు పరిశీలించారు. పూజల్లో పాల్గొన్నవారితోపాటు ప్రధాన అర్చకుడు, వీరిని ప్రోత్సహించారని.. వీరి మధ్య  జరిగిన ఫోన్‌ సంభాషణలు అనేక అంశాలను వెలుగులోకి తెచ్చాయి. అందుకే తనకు ఎందుకు గోల అనుకున్న  ప్రధానార్చకుడు బద్రీనాథ్‌ బాబు రెండు వారాల పాటు సెలవు పెట్టి వెళ్లడం అనుమానాలను పెంచుతోంది. 
                                జరిగింది తాంత్రిక పూజలా లేక రహస్య పూజలా మరొకటి అనేది ఇంకా తేలలేదు. ఏపీ ఆగమ సలహా మండలి చైర్మన్‌, కృష్ణ యజుర్వేద పండితులు చిర్రావూరి శ్రీరామశర్మ, దుర్గగుడి మాజీ ఈవో, పెనుగంచిప్రోలు ఈవో మంచనపల్లి రఘునాథ్‌లను విచారణ కమిటీగా వేయడంతో నిజాలు వెలుగులోకి వచ్చే వీలుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*