భయపడ్డ ముద్రగడ, తెల్లారే పాటికి మాట మార్పు

          పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదు. ఆయనకు నాకు పరిచయం లేదన్నారు మాజీ మంత్రి ముద్ర‌గ‌డ పద్మనాభం. కాపుల కోసం ముద్రగడ దీక్ష చేసినా పవన్ కల్యాణ్ మద్దతు పలకలేదు. ఫలితంగా పవన్ కల్యాణ్ పై కక్ష పెట్టుకున్నారు ముద్రగడ. అందుకే అసలు పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదన్నారు. గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఇదే మాట చెప్పారు. పవన్ కల్యాణ్ అంటే ఎవరని ప్రశ్నించారు. ఫలితంగా దుమారం రేగింది. ముద్రగడకు పవన్ కల్యాణ్ ఎవరో తెలియదట. చెప్పండిరా అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు కామెంట్లు చేశారు. ఇంకోవైపు ముద్రగడకు కొందరు నేతలు ఫోన్లు చేసి మరీ అంత పనికి రాదని వార్నింగ్ ఇచ్చారట. 
         నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో వెంకటగిరి సంస్థానాధీశులను మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత ముద్రగడ పవన్ గురించి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీని పై దుమారం రేగడంతో దిద్దుబాటు చర్యలకు దిగాడు ముద్రగడ. పవన్ తో పెట్టుకుంటే కష్టమనే ఆలోచనలో పడ్డాడట. అందుకే పవన్ ని విమ‌ర్శ‌లు చేసిన ముద్ర‌గడ తాజాగా కొత్త మాట చెప్పాడు. హక్కుల సాధనకై కాపు ఉద్యమం రెండు సంవత్సరాలుగా నడుస్తోందని, అసెంబ్లీ, మండలిలో బిల్లుపెట్టి తీర్మానం చేసిన ప్రభుత్వం, కాపులను ఇంకా పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదని చెప్పారు. కాపు ఉద్య‌మ‌నేత‌గా ఉన్న ముద్ర‌గ‌డకు ప‌వ‌న్ ఎవరో తెలియ‌ద‌ని ఓ సారి, ఆయ‌న తెలుసు, ఆయ‌న‌తో ప‌రిచ‌యం లేద‌ని మ‌రోసారి వ్యాఖ్యానించడం హాట్ టాపికైంది. 
            పవన్ తో తనకు పరిచయం లేదని చెప్పాను. అంతే తప్ప పవన్ ఎవరో తెలియదని అనలేదంటున్నారు. ఏదైనా రాజకీయ నాయకుడు కదా ఏదైనా చెబుతాడు. వినే వాళ్లు ఉంటే చాలు. పవన్ పై ఆయన చేసిన కామెంట్లు రికార్డు రూపేణా ఉండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. మెగా కుటుంబం నుంచి ఆయనకు ఫోన్లు వెళ్లాయంటున్నారు. ఫలితంగా పవన్ ఎవరో తనకు తెలుసు అనేలా మాట్లాడుతున్నారు ముద్రగడ. 
 

1 Comment

  1. pavan evaro theleedantunna aa VP gadu, kapulnu yemi vuddharisthadu? Chandra babu metthaga vundesariki chala over chesthunnadu. adey KCR aithe eepatiki yeppudo mend chesi bend theesivundevadu.

Leave a Reply

Your email address will not be published.


*