చరిత్ర సృష్టించిన వెంకయ్య

రాజ్యసభ ఛైర్మన్ ఉపరాష్ట్రపతి. అందుకే పెద్దల సభకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు వెంకయ్యనాయుడు. గతంలో ఉప రాష్ట్రపతులు పెద్దగా సభకు వచ్చేవారు కాదు. కానీ వెంకయ్య మిగతా వారిలా ఊరుకోవడం లేదు. అత్యధిక సమయం రాజ్యసభలోనే ఉంటున్నాడు. అంతే కాదు.. సభ్యులంతా ప్రవర్తనా నియమావళిని అనుసరించేలా చర్యలు తీసుకుంటున్నారు. హాజరు శాతాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా గతం కంటే సభ్యుల హాజరు పెరుగుతోంది. అంతే కాదు.. మరో చరిత్ర సృష్టించాడు వెంకయ్య. 
                             రాజ్యసభలో 15 ఏళ్ల తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో మొత్తం ప్రశ్నలకు అవకాశం దక్కింది. జీరో అవర్, ప్రత్యేక ప్రస్తావనల సమయంలోనూ అవకాశం లభించడంతో అంతా సంతోషం వ్యక్తం చేశారు. వెంకయ్యనాయుడు చొరవ.. సభ్యుల సహకారమే ఇందుకుకారణం. ఫలితంగా పెద్దలసభలో అనేకాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అమరావతి రాజధాని నిర్మాణం, జీఎస్‌టీ, భారతీయ సంప్రదాయేతర ఇంధనసంస్థల పనితీరు, బిట్‌కాయిన్‌.. దాని నియంత్రణ, మొండి బకాయిలు తదితర కీలకాంశాలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. సభ ప్రశాంతంగా, పరిపూర్ణంగా సభ సాగేలా చూసిన వెంకయ్యనాయుడిని పలువురు సీనియర్‌ సభ్యులు అభినందించారు. చివరిసారిగా 2002లో జరిగిన 197వ సమావేశంలో ప్రశ్నోత్తరాల జాబితాలోని అన్ని ప్రశ్నలనూ సభలో ప్రస్తావించారు. అప్పట్లో ప్రశ్నలువేసిన 20మందిలో 10మంది హాజరుకాలేదు. ఫలితంగా మిగతా వారితో మాట్లాడించారు. కానీ ఈ సారి మొత్తం 18మందితో మాట్లాడించారు వెంకయ్య. తెలుగువాడి ఘనత మరోసారి హస్తిన వీధిలో మోగేలా చేశాడు వెంకయ్య. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*