పవన్ కల్యాణ్ పై పెరిగిన విమర్శల దాడి

రాష్ట్ర విభజనలో అన్యాయం జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నట్లు. నేను కేసీఆర్ తాటతీస్తా అని అన్నారు గతంలో జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సి.ఎం కేసీఆర్ దేశానికే ఆదర్శమన్నారు. రాజకీయాలు ఇప్పుడే వంట బట్టించుకుంటున్నాడు పవన్. పార్టీ పెట్టిన నాలుగేళ్లకు సభ్యత్వం తీసుకున్న ఆయన ఇప్పుడు హడావుడి మొదలు పెడుతున్నాడు. రైతులకు 24 గంటలు విద్యుత్ ఇస్తున్న కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఆదర్శంగా తీసుకోవాలట. అసలు విద్యుత్ ఒప్పందాలు ఏంటి. కరెంట్ ఇక్కడ ఎంత ఉత్పత్తి అవుతోంది. ఎందుకు అలా ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నారో పవన్ కు తెలియదు. అందుకే ఆయనకు విద్యుత్ జేఏసీ నేత రఘు రాసిన విద్యుత్ ఒప్పందాల పుస్తకం పంపిస్తున్నట్లు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. తమకు వైరి వర్గంగా ఉన్న కేసీఆర్ వద్దకు పవన్ వెళ్లినా టీడీపీ నోరు తెరవలేదు. అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ ఏకిపారేస్తోంది. 
                         కేసీఆర్ ను చూసి ఆంధ్రప్రదేశ్ నేతలు నేర్చుకోవాలని పవన్ అన్న తీరు విమర్శలకు తావిస్తోంది. పవన్ అజ్ఞానానికి ఈ మాట నిదర్శనమని ఏపీ ప్రజలు నెట్టింట్లో తప్పుపడుతున్నారు. ముందు ప్రజారాజ్యం పార్టీలా కాకుండా మీ పార్టీ పక్షాన పోటీ చేసి గెలువు. అప్పుడు మీ మాటలు నమ్ముతామంటున్నారు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పవన్ తీరును తప్పు పట్టారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన పథకాలు ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తుందని.. అందుకే 24 గంటల విద్యుత్ ను ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారన్నారు. 
                             పవన్ పై మాటల దాడి పెంచింది కాంగ్రెస్. ఇక దూకుడు మంత్రంగా వెళుతోంది. ఇన్నాళ్లు పవన్ కల్యాణ్ ను ఆ పార్టీ సీరియస్ గా తీసుకోలేదు. కానీ తెలంగాణలో వేలు పెట్టేసరికి పవన్ ను ఏకి పారేసింది. అసలు రాజకీయాలు నీకు ఏం తెలుసునంటూ మండి పడ్డారు కాంగ్రెస్ నేతలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, రేవంత్ రెడ్డిలు పవన్ తీరును వ్యతిరేకించారు. అసలు పవన్ ముందు పుస్తకాలు చదివి అవగాహన పెంచుకోవాలన్నారు వాళ్లు. 

1 Comment

  1. Vallu anukuntunnaru.. veellu anukuntunnaru ani cheppakura.. Vallevaro cheppu. Nuvve adigav kada other heading lo.. KCR ni chusi nerchukovalani ante.. examples kavalani… Nee notlo emi vundira, evaru antunnaro cheppara bevakuf. Nee neethi malina varthalu.. nee batuku..

    Nuvvu deeni post cheyavu ani telusu.. Even oka post kuda ravadam ledente ardmavutundi.. Okka comment kuda neeku anukoolanga ravadam ledu ani…..

    Ore!! Kojja news.. Namasthe Andhra oka kojja news channel run by pacha party.

Leave a Reply

Your email address will not be published.


*