జనసేన సభ్యత్వానికి శ్రీకారం…

జనసేన పార్టీ సభ్యత్వాలకు శ్రీకారం చుట్టింది. తొలి సభ్యత్వాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ  కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తొలి సభ్యత్వ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు, స్నేహితులు హాజరయ్యారు. ఆ పార్టీలోని ముఖ్యులకు సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు పవన్. రెండు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇక మీదట ప్రారంభమవుతుందని చెప్పారాయన.
                    పదేళ్లకు పైగా తనను అనుసరిస్తున్న వారితో మూడు రోజులుగా విడతల వారీగా పవన్‌కల్యాణ్‌ చర్చించారు. తమ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను వారికి వివరించారు. అదే సమయంలో వారు చెప్పిన సలహాలు, సూచనలను తీసుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన నాలుగేళ్ల తర్వాత సభ్యత్వం స్వీకరించడం విశేషమే మరి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*