వామ్మో.. 16 స‌ర్వేలా!

కేసీఆర్‌.. 105 స్థానాల‌కు అభ్య‌ర్థుల పేర్లు వెల్ల‌డించి తానేమిటో చెప్పాడు. అదే స‌మ‌యంలో తాను ఎవ‌రికి ప్రాధాన్య‌త ఇస్తున్నాన‌నేది చెప్ప‌క‌నే చెప్పారు. త‌న‌కు బ‌లం అనుకున్న‌వారు.. రేప‌టి  ఎన్నిక‌ల్లో నెగ్గుతార‌ని అనుకున్న వారికే  త‌న ప‌క్క‌న చోటు అంటూ తేల్చారు. అయితే.. ఇది ఏ ఒక్క‌రూ గ‌మ‌నించ‌లేక‌పోయారు. క‌నీసం అంచ‌నా వేసే సాహ‌సం చేయ‌లేక‌పోయారు. నాయ‌కుడిగా కేసీఆర్ తానేమిటో చాట‌డ‌మే కాదు.. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ స‌వాల్ విసిరిన‌ట్టుగానే విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే.. దీనివెనుక కేసీఆర్ తానెంత‌గా క‌స‌ర‌త్తు చేశాన‌నేది మాత్రం చెప్ప‌క‌నే చెప్పారు. ఫామ్‌హౌస్ లో కూర్చుని సిద్ధం చేసిన జాబితా కాద‌ని… దీనికి తాను 14-16 వ‌ర‌కూ స‌ర్వేలు చేయించి సెల‌క్ట్ చేసిన సంగ‌తి బ‌హిరంగంగానే అంగీక‌రించారు. అయితే వ‌చ్చిన‌ చిక్క‌ల్లా.. మిగిలిన చోట్ల అభ్య‌ర్థుల ఎంపిక  ఎందుకు ఆల‌స్య‌మైంది. నిజంగా.. అక్క‌డున్న సిట్టింగ్‌ల‌కు.. త‌న వెంట ఉద్య‌మంలో నిలిచిన వారికి ఇస్తారా! అనేది డౌటే. ఎందుకంటే.. కొండా సురేఖ‌, దానం నాగేంద‌ర్, డీఎస్ ఫ్యామిలీ, బాబూమోహ‌న్.. ఇలా కొస‌రు నేత‌ల‌ను ప‌క్క‌న‌బెట్టారు. పైగా వీరిపై కేసీఆర్ సానుకూలంగా లేర‌నే ప్ర‌చారం కూడా సాగుతుంది. వ‌రంగ‌ల్‌లో కొండా దంప‌తులు.. ఇప్ప‌టికే కేసీఆర్ తీరుపై బ‌హిరంగంగానే నిర‌స‌న తెలిపారు.
పైగా.. తాము పార్టీ జండాల‌తో గెలిచే వారం కాద‌ని.. కొండా అనే పేరే త‌మ‌కు అండ అంటూ బ‌హిరంగంగానే సురేఖ ప్ర‌క‌టించారు. ఇప్పుడు సురేఖ కూతురు కూడా ఎమ్మెల్యే సీటు కోసం పోటీప‌డుతున్నారు. అంద‌రి మాదిరిగానే.. ఈ ఎన్నిక‌ల్లో వార‌సుల‌ను నిల‌బెట్టుకోవాల్సిన బాధ్య‌త కొండా దంప‌తుల‌కూ ఉంది. డీఎస్‌.. కాంగ్రెస్ వెలిగిన ఈయ‌న ఇప్పుడు న‌న్ను ద‌మ్ముంటే స‌స్పెండ్ చేయ‌మంటూ గులాబీబాస్‌నే స‌వాల్ చేసేంత‌వరకు చేరారు. ఇక‌.. దానం నాగేంద‌ర్‌.. ఖైర‌తాబాద్ కావాలంటూ ఆశ‌ప‌డినా.. అక్క‌డ పీజేఆర్ వార‌సురాలు విజ‌యారెడ్డి.. అడ్డుపుల్ల వేస్తుంది. దీంతో అక్క‌డా ఎవ‌రు అనేది ప్రశ్న‌గానే మిగిలింది. అందోల్ నుంచి బాబూమోహ‌న్‌కు ఈ సారి.. సీటు ఇవ్వ‌టం క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తుంది. నాలుగేళ్ల అధికారంలో ఆయ‌న‌పై గ‌తంలో ఎన్న‌డూ లేనంత వ్య‌తిరేక‌త నెల‌కొంది. టీడీపీలో ఉన్న‌పుడు మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న చోట‌నే.. పార్టీ మారి గెలిచినా.. చీత్కారాలు త‌ప్ప‌ట్లేదు. ఈ లెక్క‌న‌.. ఎంత‌మంది సిట్టింగులు.. రాజ‌కీయ జీవితానికి దూర‌మ‌వుతార‌నేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.