ల‌గ‌డ‌పాటి స‌ర్వేపై ఇన్ని విమ‌ర్శ‌లా?

మొత్తానికి ప్ర‌జాకూట‌మి- వ‌ర్సెస్ – టీఆర్ఎస్ యుద్ధంలో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ న‌లిగిపోతున్నాడు. ఆయ‌న డ‌బ్బులు ఖ‌ర్చుపెట్టుకుని మ‌రీ స‌ర్వే చేసి జ‌నాల‌తో తిట్లు తింటున్నాడు. నిజంగా ఇదొక విచిత్ర‌మే. అత‌ను గ‌తంలో రాజ‌కీయ నాయ‌కుడే కావ‌చ్చు గాని పోలింగ్ ముగిసిన త‌ర్వాత అబ‌ద్ధాలు చెబితే ఆయ‌న‌కేం వ‌స్తుంది? ఇది లాజిక్‌. పైగా ఉత్తినే త‌న క్రెడిబులిటీ పోగొట్టుకోవాల‌ని అత‌ను ఎందుకు అనుకుంటారు? కానీ దీన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆయ‌న‌పై చాలా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ల‌గ‌డ‌పాటి ధైర్యంగా చెప్ప‌లేక‌పోతున్నార‌ని, మాట్లాడేట‌పుడు త‌డ‌బ‌డుతున్నాడ‌ని అన్న టీఆర్ఎస్ నేత సీతారాం నాయ‌క్ ల‌గ‌డ‌పాటి స‌ర్వేను అనుమానించారు. అంతేకాదు, ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల‌న్నీ టీఆర్ఎస్‌కే ప‌ట్టం క‌ట్టాయ‌ని, ల‌గ‌డ‌పాటి మూడు నెల‌ల నుంచి స‌ర్వే చేసి అంత త‌డ‌బాటు ఎందుక‌న్నారు. ఒక ఫిగ‌ర్ చెప్ప‌లేక‌పోతున్నాడు. టీఆర్ఎస్‌కు 35 కు అటు ప‌ది ఇటు ప‌ది అంటున్నాడు. దీనికి ఏం క్రెడిబులిటీ ఉంటుంది? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

మ‌రో బీజేపీ నేత విష్ణువ‌ర్ద‌న్‌రెడ్డి కూడా దీనిపై స్పందించారు. అది టీడీపీ ఆఫీసులో వండిన స‌ర్వే అని మండిప‌డ్డారు. బీజేపీకి 7 కాదు, ప‌ది స్థానాలు వ‌స్తాయి. తెలంగాణ‌లో హంగ్ వ‌స్తుంది. మేము లేకుండా ప్ర‌భ‌త్వ‌మే ఏర్ప‌డ‌దు అన్నాడు. ల‌గ‌డ‌పాటిని టీడీపీ వాళ్లు అంత భుజానికి ఎత్తుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది అని ప్ర‌శ్నించారు. ల‌గ‌డ‌పాటి త‌న క్రెడిబులిటీ పోగొట్టుకున్నాడ‌ని విష్ణు వ్యాఖ్యానించారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.