రెక్క‌లు తెగిన క‌మ‌లం రెప‌రెప‌లాడేనా?

సార్వత్రిక ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ… బీజేపీ హవా తగ్గుతుంద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలు కూడా వెన‌క్కి త‌గ్గుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో మోదీ మోసం చేశారని తెలుగుదేశం ఎన్డీఏ నుంచి త‌ప్పుకుంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో పీడీపీకి కూడా బీజేపీకి గుడ్ బై చెప్పింది. లోక్ సభలో పీడీపీ ఎంపీ ఒక్కరే ఉన్న‌ప్ప‌టికీ  ఆ ప్రభావం ఎన్డీఏ పక్షాలపైన పడ‌నుంది. ఇప్పటికే ఎన్డీఏలోని కొన్ని భాగ‌స్వామ్య పార్టీలు బీజేపీపై ఆగ్ర‌హంతో ఉన్నాయి. శివసేన లాంటి పార్టీలు. బీహార్ నితీష్ కుమార్ లాంటి ఉద్దండులు సైతం కమలనాథులపై కన్నెర్ర జేస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు అయినా నితీష్ బీజేపీతో కలిసి ఉంటాడనే నమ్మకం లేదు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురైన పరిస్థితులు చూస్తుంటే కమలానికి ఎదురుగాలి వీస్తోందని స్ప‌ష్టంగా తెలుస్తోంది. కమలం రేకులు రాలిపోతుంటే ఆ పార్టీ నేతల్లో నైరాశ్యం నిండుకుంద‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ ముక్త్ భారత్  పేరుతో అమిత్ షా, మోడీ ద్వయం చేస్తున్న ప్రయత్నం నిష్ఫ‌ల‌మ‌వుతుంద‌నే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో యేడాదిలో సార్వత్రిక ఎన్నికలు స‌మీస్తున్న‌ తరుణంలో కమలనాథుల్లో ఈ పరిస్థితులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు సాధించింది. అప్ప‌ట్లో ప్రభుత్వ ఏర్పాటుకు 10 సీట్లు ఎక్కువే సాధించింది. అయితే గ‌డచిన నాలుగేళ్లలోజరిగిన పలు ఉపఎన్నికల్లో బీజేపీ 10 సీట్లను కోల్పోయింది. దీంతో ఎంపీల సంఖ్య 272కు పడిపోయింది. తాజా ఉప ఎన్నికల ఫలితాల్లో కూడా బీజేపీకి ఓట్ల శాతం కూడా బాగా తగ్గిపోయింది. మోదీ గ్రాఫ్ పడిపోతుందనే అభిప్రాయంలో ఆ పార్టీతో ఉంది. ఇక‌ రాష్ట్రాల్లో ఏంచేయాల‌నే దానిపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్న‌ట్లు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.