బాబు పై నాగబాబు కామెంట్! అసలు కారణమిదా?

పలు ప్రజా సంక్షేమ కార్యాక్రమాలు చేస్తూ ఏపీ తిరుగులేని నాయకుడిగా పేరొందుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికల వేళ మరింత దూకుడు ప్రదర్శిస్తూ ఈ నాలుగున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమ పథకాల తీరును వెలుగెత్తి చాటుతున్నారు. దీంతో ఏపీ ప్రజానీకమంతా చంద్రబాబు వైపే ఉంది. పైగా ఇతర పార్టీల నేతలు సైతం టీడీపీ గూటికి చేరుతుండటం ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో బాబు పై ఏదో ఒక రాయి వేయాలని ప్రయత్నిస్తున్నారు. అటు వైసీపీ అధినేత జగన్ నోటికొచ్చిన కామెంట్లు చేస్తుంటే.. జనసేన అధినేత పవన్ అన్న నాగబాబు ఇష్టారీతిలో మాట్లాడుతున్నారు.

నా ఛానెల్ నా ఇష్టం అని యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన ఆయన ఆ పేరుకు తగ్గట్టుగానే నిజానిజాలు ఆయన ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడేస్తున్నారని అంటున్నారు జనం. అంతకుముందు బాలకృష్ణ, లోకేష్ పై కామెంట్స్ చేసి సంచలనం సృష్టించిన ఈయన తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ మాట్లాడటం చర్చనీయాంశం అయింది. ”పాలు పొంగడానికి నాలుగున్నర నిమిషాలు పడుతుంది.. కానీ చంద్రబాబుకు రక్తం మరగడానికి నాలుగున్నరేళ్లు పట్టింది” అంటూ నాగబాబు కామెంట్ చేశారు. అంటే ఏపీకి బీజేపీ చేసిన మోసంపై రాష్ట్రంలోని ఇతర పార్టీలు ఎలాగూ మాట్లాడరు.. అలాగే బాబు కూడా మాట్లాడొద్దనేనా దీనర్థం!

అయితే ప్రస్తుతం జనసేన పార్టీని ఎవ్వరు పట్టించుకోవటం లేదని, అందుకే ఆ భాద్యతలు నాగబాబు నెత్తిన ఉస్కున్నారనే టాక్ వినిపిస్తోంది జనాల్లో. ఈ నేపథ్యంలో ఏదో ఒక రకంగా వార్తల్లో నిలవాలనే ఉద్దేశ్యంతో ప్రజా మద్దతున్న అధికార పార్టీపై కామెంట్లు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి.. ఎందుకు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడలేకపోయారు. రాజకీయాల్లో ఫెయిలతే.. ప్రజలకు ఆ శిక్ష పడాల్సిందేనని.. కసిగా అనుకున్నారా? ప్రజారాజ్యం పార్టీ విషయంలో తెర వెనుక ఏం జరిగిందో కానీ జనసేన రూపంలో పార్ట్ -2 ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ పార్టీకి మార్కెటింగ్ చేసుకోవడానికే నాగబాబు చేస్తున్న ప్రయత్నాలే ఇవి అంటున్నారు జనం.

3 Comments

  1. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పార్టీలన్నీ ఏకమై ‘నో ఎంట్రీ టు మోడీ..మోడీ గో బ్యాక్’ అని నినదిస్తుంటే ఈ మెగా బ్రదర్స్ ఎక్కడ దాక్కున్నారు. అభిమాన జనాన్ని చూస్తూనే రెచ్చిపోయి,ఊగిపోయి ఉపన్యాసాలతో రెచ్చిపోయే రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీని నిలదీసే దమ్ము,ధైర్యం లేదా. ఈ మెగా బ్రదర్స్ రక్తం చచ్చి పోయిందా !?

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.