తెలంగాణలో కూటమిదే హోరు !

తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ప్రజాకూటమిదే విజయమని తేలిపోయింది. ఎన్నికలు ముగిసిన అనంతరం సర్వే మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రకారం ప్రజాకూటమికి 65 స్దానాలు వస్తాయని లెక్క తేల్చారు. ఇక అధికారం తెలంగాణ రాష్ట్ర సమితికి 35 స్దానాలతో సరిపెట్టకోనుందన్నారు. రెండు రోజుల క్రితం చెప్పినట్లుగా తెలంగాణ ఎన్నికలలో 7 స్వతంత్రులు గెలిచే అవకాశం ఉందన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ కూడా మరో 7 స్దానాలలో గెలిచే అవకాశం ఉందని తేల్చారు. కాంగ్రెస్ పెద్దన్నగా, తెలుగుదశం, తెలంగాణ జన సమితి, సీపీఐ కూటమిగా ఏర్పడిన విషయం తెల్సిందే. రాజధాని పాత బస్తీలో గట్టి పట్టున్న మజ్లిస్ 7 స్దానాలలో తన అధిపత్యాన్ని నిరూపించుకోనుంది. కూటమిలో భాగంగా 13 స్థానాలలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీకి 7 స్థానాలు దక్కుతాయని, తెలుగుదేశం పార్టీ నుంచి రెబల్‌గా పోటీ చేసిన స్వతంత్రులు గెలిచే అవకాశం ఉందని లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. గడచిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువగా ఉందని, తెలంగాణలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని లగడపాటి పేర్కొన్నారు. 

తెలంగాణ ఎన్నికలపై ఉత్తరాదికి చెందిన కొన్ని ఛానల్స్ చేసిన ఎగ్జిట్ పోల్స్‌ను లగడపాటి తప్పు పట్టారు. ఉత్తరాది ఎన్నికలకు, దక్షిణాది ఎన్నికలకు మధ్య వ్యత్యాసం ఉంటుందని, ఈ వ్యత్యాసాన్ని ఉత్తరాది ఛానల్స్ పట్టుకోలేక పోయాయని లగడపాటి పేర్కొన్నారు. తాను ఒక ఎనలిస్టుగానే సర్వే చేసాను తప్ప రాజకీయ నాయకుడిగా చేయలేదని వివరణ ఇచ్చారు.”నాకు ఏ పార్టీ లేదు, నేను రాజకీయ నాయకుడిని కాదు. నా సర్వే కూడా ఆ కోణంలోనే జరిగింది.” అని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేసారు. ఈ ఎన్నికలలో ఓటర్లు ప్రేమను, కోపాన్ని, వాత్సల్యాన్ని, వ్యతిరేకతను చూపించారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండడం వల్ల భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం, స్వతంత్రులు ఎక్కువగా గెలుస్తున్నారని అన్నారు. తెలంగాణ జిల్లాలలో 85% ప్రజాకూటమికి అనుకూలంగా ఉందన్నారు. డబ్బు ప్రభావం ఈ ఎన్నికలలో తీవ్రంగా ఉందని అందుకే 10 స్దానాలు అటు ఇటు చేపాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. గతంలో లగడపాటి చేసిన సర్వేలు నిజం కావడంతో తాజా సర్వే కూడా ఆ కోవలోనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

1 Comment

  1. Two things are prominently visible during compaigning.The public meetings of Mahakootami vibrated with life while other meetings were routine and dull. The Mahakootami leaders were successful in taking the failures such as making an S.C as C.M, 3 acres of land to each S.C family, two bed room flat for homeless people, one job for each family. That ended the games of throne played till now

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.