
అమెరికా కేంద్రంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు తెరవెనుక సాగిస్తున్న చీకటి బాగోతం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. టాలీవుడ్‌కు చెందిన పలువురు వర్ధమాన హీరోయిన్లు, యాంకర్లతో.. ఓ వ్యాపారవేత్త, పలు హిట్ సినిమాల కోప్రొడ్యూసర్ వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న వార్త సంచలనం రేకెత్తించింది. ఈ హైలెవెల్ వ్యభిచారం గుట్టును అమెరికాలోని ‘చికాగో ట్రిబున్’ అనే వార్త సంస్థ రట్టు చేసింది. ఈ వ్యభిచారం నిర్వహిస్తున్న తెలుగు దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనపై తెలుగులో ప్రముఖ యాంకర్ అనసూయ స్పందించింది. ‘‘నేను చాలా రోజులుగా అమెరికా వెళ్లలేదు. 2014లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌తో కలిసి ఓ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లాను. ఆ తర్వాత 2016లో ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి అమెరికాలో తెలుగు అసోషియేషన్ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని అడిగాడు. అతను మాట్లాడే విధానం నాకు నచ్చలేదు. దాంతో ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాను. నేను ఒప్పుకోకపోయినా నా ఫోటోను పోస్టర్లో వేసి ప్రచారం చేసుకున్నార’’ని అనసూయ చెప్పింది.
Be the first to comment